జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ భూములను కూడా ఆక్రమించుకుని దోచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వలపేక్షతో కాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలో ఓటమి భయంతోనే బీసీ కార్డును తెరపైకి తెచ్చారని మంగళగిరిలో వైసిపి ఓటమికి జనసేన కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ దురుద్దేశంతోనే బీసీలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ను ఖండిస్తున్నా…
76
previous post