చాలామందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం శుత్రువులను పెంచడమే కాదు. స్నేహితులను, కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది. కొపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు తింటే వెంటనే కోపం కంట్రోల్ అవుతుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్‌లో పసుపు చేర్చుకుంటే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమిన్ మన శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి ‘ఫీల్-గుడ్’ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అరటిపండులో విటమిన్ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. డోపమైన్ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్ చేస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి కోపాన్ని తగ్గిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకతే వేరు ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాలు నరాల కు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరంలో కోపాన్ని సైతం తగ్గిస్తాయని భావోద్వేగాలని నియంత్రిస్తుందని తెలుస్తోంది. శరీరానికి జుట్టుకు ఎంతో మేలు చేసే అవిస గింజలు కోపాన్ని సైతం నియంత్రిస్తాయని తెలుస్తోంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్‌ను మెండుగా ఉంటాయి. అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్ చేసే సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది.
కోపం ఎక్కువగా వస్తుందా.. ఈ ఆహారం తినండి!
104
previous post