గంజాయి నుంచీ తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి మాత్రమే. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు. CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విపరీతమైన నొప్పి, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి, కంగారు, బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. ఈ ఆతృత అనేది సర్వ రోగాలకూ పరోక్ష కారణమవుతోంది. గంజాయి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో కూల్‌గా, హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్లో ఉన్నాయి. సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా, వామ్టింగ్ అయ్యేలా ఉంటుంది. మన చర్మంపై మచ్చలు, మొటిమల వంటివి కామన్. అవి జన్యుపరమైన కారణాల వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. వాటి నుంచీ తప్పించుకోవాలంటే గంజాయి నూనె వాడాలంటున్నారు పరిశోధకులు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. మొటిమలు, మచ్చల అంతు చూస్తాయి. మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నూనె బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది. హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీపీ పెరగకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఇలాంటి ఆయిల్స్ రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్లో ఉంటుంది.
గంజాయి నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
108
previous post