మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ ఎత్తున మెఫెడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. షోలాపుర్ వద్ద కుర్కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్ చేశారు. మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్ ఏరియాలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్నారు. వీటి మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 2,200 కోట్లుగా అంచనా వేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
మేడారం జాతర పై ప్రధాని మోదీ ట్విట్టర్
ఫార్మా ప్లాంట్ ఓనర్‌ను అరెస్టు చేశామని,మరో ఇద్దరికి దీంతో సంబంధం ఉంది అని అదనపు పోలీస్ కమిషనర్ తెలిపారు. తమ బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని పోలీస్ కమిషనర్ అన్ఆరు. డ్రగ్స్‌ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ యజమాని, ఈ డ్రగ్ మాఫియా మాస్టర్‌మైండ్ మధ్య సంబంధాలు ఎలా మొదలయ్యాయో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.