77
ఐటీ, సమాచార, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు చేరుకున్న శ్రీధర్‌బాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.