నల్ల మిరియాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తక్కువ కర్కుమిన్ తీసుకునేవారితో పోలిస్తే అధిక మోతాదులో కర్కుమిన్ తీసుకునే ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. టమోటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. లైకోపీన్ అనేది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. ఇది ఊపిరితిత్తుల సామర్థాన్ని పెంచడంతో పాటుగా ఉబ్బసం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆలివ్ శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం తగ్గుతుంది. బ్లూబెర్రీస్ ల్లో పోషకాలు పుష్కలంగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఆంథోసైనిన్లు అనేవి పిగ్మెంట్లు. ఇవి ఊపిరితిత్తుల్లోని కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయని తేలింది. గ్రీన్ టీ లాగే కాఫీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కెఫిన్ ఆస్తమా లక్షణాలను, ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ మన ఊపిరితిత్తుల కార్యకలాపాలను పెంచుతుంది. ఇది సిఓపిడి ప్రమాదాన్ని కూడా తప్పిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా గ్రీన్ టీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
Read Also..
Read Also..