సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..!

KCR

Advertisements

&NewLine;<p>ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది&period; అక్టోబర్ 30à°¨ బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది&period; స్టార్ కాంపెయినర్‌గా&comma; బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది&period; ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది&period; ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది&period; ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోవట్లేదని పేర్కొంది&period;<br>దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు&period; దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14à°¨ ఈసీకి నివేదిక సమర్పించారు&period; ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.