లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ వదలడం లేదు. లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు తాజాగా ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న విచారణకు రావాలని తాజా సమన్లలో పేర్కొంది.
ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో, తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ తెలిపింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.