ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ – ED మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరుకాలేదు. తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి ఆయనను విచారణకు పిలిచింది. ఈసారి కేజ్రీవాల్ గైర్హాజరైతే అరెస్టు వారెంట్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని, తాను ఈ సమన్లను స్వీకరించబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ కు ED మరోసారి సమన్ల జారీ…
66
previous post