ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…

Election Commission Commissioner Arun Goyal resigns

Advertisements

&NewLine;<p>కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ పదవికి రాజీనామా చేశారు&period; ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే పదవి నుండి తప్పుకొవడం చర్చనీయాంశం&period; అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది&period; ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు&period; తాజా రాజీనామా అనంతరం&comma; ఇప్పటికే ఓ వెకెన్సీ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు&period; లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది&period; గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి&period; 2022 నవంబర్ 18à°¨ ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు&period; ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు&period; చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా&comma; ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ&comma; అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..