పాకిస్తాన్ లో ఎన్నికలు వాయిదా..!

Elections

Advertisements

&NewLine;<p>పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; ఫిబ్రవరి 8à°¨ జరగాల్సిన ఎన్నికలను భద్రతాపరమైన కారణాలు&comma; వాతావరణ పరిస్థితుల రీత్యా వాయిదా వేసేందుకు పాకిస్తాన్ సెనెట్ నిర్ణయించింది&period; ఈ మేరకు సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు&period; సెనెటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంకీ&comma; పీఎంఎల్-ఎన్ సెనెటర్ అఫ్నాన్ ఉల్లాహ్ దీన్ని వ్యతిరేకించారు&period; ప్రజలకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని&comma; స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తీర్మానంలో ప్రస్తావించారు&period; అన్ని ప్రాంతాల వారు ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు&period; పాకిస్తాన్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే జనవరి&comma; ఫిబ్రవరి మాసాల్లో బలొచిస్థాన్&comma; ఖైబర్ ఫాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో ఓటర్ల స్పందన తక్కువగా ఉండొచ్చని తీర్మానంలో అభిప్రాయపడ్డారు&period; ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా తీర్మానంలో ప్రస్తావించారు&period; ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకుల భద్రతపై కూడా తీర్మానంలో ఆందోళన వ్యక్తమైంది&period; ప్రముఖ నాయకులకు ప్రమాదం పొంచి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ హెచ్చరికలను కూడా తీర్మానంలో పేర్కొన్నారు&period; ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా&comma; బలొచిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగిన వైనాన్నీ ప్రస్తావించారు&period; ఈ సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలను నిర్వహించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సెనెట్ అభిప్రాయపడింది&period; ఈ మేరకు ఎన్నికల వాయిదా తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!