73
చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. వి.కోట మండలంలో నిన్న రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలపై స్వైర విహారం చేశాయి. ఉదయం రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల మందను అధికారులు అక్కడి నుంచి తరిమివేశారు. దానమయ్య గారిపల్లి కుమ్మరిమడుగు, మిట్టూరు, నక్కనపల్లి మోట్లపల్లి, బాలేంద్రపల్లి, వెర్రినాగేపల్లి, వడ్డేపల్లి గ్రామాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయని అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేతికివచ్చిన పంటను ఏనుగులు ధ్వసం చేయడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Read Also..
Read Also..