166
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ డి.ఐ.జి అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని అన్నారు.