ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..

Advertisements

<p>&&num;8216&semi;ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్&&num;8217&semi; ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది&period; ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది&period; ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది&period; ఇప్పటికే విడుదలైన మొదటి పాట &&num;8216&semi;సంచారమే&&num;8217&semi; అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా&comma; తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది&period;<&sol;p>&NewLine;<p>&&num;8216&semi;ఎపిక్&&num;8217&semi; టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ&comma; వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది&period; &OpenCurlyQuote;బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది&period;<&sol;p>&NewLine;<p>90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్&comma; ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు&period; తాజాగా విడుదలైన టీజర్&comma; మొదటి సినిమాతోనే ఆయన ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం &OpenCurlyDoubleQuote;సంచారమే” ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది&period; ఇక టీజర్ లోనూ తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించారు హేషమ్ అబ్దుల్ వహాబ్&period;<&sol;p>&NewLine;<p>లండన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఒక అందమైన&comma; ఆసక్తికరమైన ప్రేమకథగా కనిపిస్తోంది&period; ఆధునిక సంబంధాలు&comma; ప్రేమలో మారుతున్న భావోద్వేగాలను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తోంది&period; ఈ ప్రేమకథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ &lpar;అంతర్ముఖుడు&rpar; పాత్రలో కనిపిస్తుండగా&comma; వైష్ణవి చైతన్య పూర్తి విరుద్ధంగా ఎక్స్‌ట్రోవర్ట్ &lpar;బహిర్ముఖురాలు&rpar; పాత్రలో ఆకట్టుకోనున్నారు&period; విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది&quest; వారి ప్రయాణం ఎలా సాగింది&quest; అనేది టీజర్‌లో ఎంతో హృద్యంగా చూపించారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన &&num;8216&semi;ఎపిక్&&num;8217&semi; టీజర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను&period; ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది&period; ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు&period;&period; నా కథ నాకే చెప్పాడా అనిపించింది&period; ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుతున్నాను&period; ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి&period; విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు&period;&period; ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి&period; కుటుంబం&comma; ప్రేమ&comma; బంధం&comma; భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి&period; దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది&period; భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు&period; వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది&period; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది&period; సార్&comma; లక్కీ భాస్కర్&comma; టిల్లు&comma; మ్యాడ్&comma; జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది&period; మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది&period; సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది&period; ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది&period; ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ముందుగా &&num;8216&semi;సంచారమే&&num;8217&semi; పాటపై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు&period; ఎపిక్ కథ నాకు చాలా నచ్చింది&period; కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను&period; నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది&period; కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది&period; చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది&period; ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది&period; ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు&period; ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా&period; ఇదొక అందమైన ప్రేమ కథ&period; మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది&period; సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు&period; మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఈ సినిమా ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ&period; కథ రాస్తున్నప్పుడు&comma; తీస్తున్నప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని నమ్మాను&period; చిత్ర విజయం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాము&period; బంధాలను&comma; భావోద్వేగాలను గొప్పగా చూపించడానికి మా శాయశక్తులా కృషి చేశాము&period; ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం&period; 90’s వెబ్ సిరీస్‌ తీసినట్టుగానే ఈ సినిమాను కూడా సహజంగా తెరకెక్కించాము&period; మీ తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమాను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సితార ఎంటర్‌టైన్‌మెంట్స్&comma; ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ&comma; సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది&period; అత్యుత్తమ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తోంది&period; అజీమ్ మహమ్మద్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా&comma; ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే &OpenCurlyDoubleQuote;సంచారమే” గీతం మ్యూజికల్ హిట్‌గా నిలవగా&comma; తాజాగా విడుదలైన టీజర్ అందరినీ కట్టిపడేస్తోంది&period; &&num;8216&semi;ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్&&num;8217&semi; చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి భారీ విడుదలకు సిద్ధమవుతోంది&period; త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..