ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు..!

onion

Advertisements

&NewLine;<p>ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దలు&period; పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే అనేక రకములైన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు&period; మనం నిత్యం వంటకాల్లో వాడుకునే ఉల్లి గడ్డ లో చాలా ఔషధ విలువలు ఉన్నాయి&period; ఉల్లిగడ్డలో అల్లిసిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది&period; ఇది క్రిమి సంహారిణి 50 గ్రాముల ఉల్లిపాయ ముక్కల్లో దాదాపు 20 గ్రాముల ఇన్సులిన్ ఉంటుంది&period; ఉల్లిపాయ చక్కెర వ్యాధి రాకుండా కాపాడుతుంది&period; ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది&period; పిత్త వ్యాధులను తగ్గించి పొట్టను కాపాడుతుంది&period; పచ్చి ఉల్లి పాయలను ఆహారంలో వాడితే గుండె సమస్యలకు ముందుగా పని చేస్తుంది&period; శరీరానికి హానికరమైన కొవ్వు ను కరిగించి గుండెకు అవసరమైన హెచ్ డి ఎల్ కొవ్వును పెంచుతుంది&period; ఉల్లి పాయ ముక్కలను సన్నగా తరిగి అందులో పెరుగు వేసి కలిపి పైన జీలకర్ర పొడి వేసి భోజనంలో తింటే గ్యాస్టిక్ సమస్యలు తగ్గి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది&period; ఒక వేళ ముక్కులో నుంచి రక్తం కారితే వెంటనే ఉల్లిపాయను కోసి వాసన చూస్తే రక్తం కారడం ఆగిపోతుంది&period; ఎండా కాలం లో తిరిగేప్పుడు ఉల్లి గడ్డను జేబులో వేసుకుని లేదా టోపీ లో పెట్టి ఉంచితే ఎండ దెబ్బ తగలదు&period; ఉల్లిగడ్డ వాడితే వీర్య కణాల లోపాన్ని సవరించి పురుషత్వాన్ని పెంచుతుంది&period; కీళ్ల వాటం &comma; నొప్పులు ఎక్కువైనప్పుడు ఉల్లిపాయను దంచి రసం తీసి ఆవనూనెలో వేసి తైలంగా కాచి నిలువ చేసి దాచుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period; మూత్ర పిండాలలో రాళ్ళ సమస్య వచ్చినప్పుడు కొండ పిండి కూర చెట్టు వేరు భాగాన్ని కడిగి రసం తీసి &comma; ఉల్లిగడ్డ రసంతో కలిపి తాగితే మూత్ర పిండాలలో రాళ్లు కరిగి పోతాయి&period; పంటి చిగుళ్ల నుంచి రక్తం కారితే ఉల్లి రసంతో ఉప్పు కలిపి చిగుళ్లపై రుద్దుకుంటే రక్తం రావడం ఆగి పోతుంది&period; పరిగడుపున ఉల్లిపాయ రసంలో నిమ్మ రసం కలిపి ప్రతిరోజూ తాగితే శరీరం బరువు క్రమంగా తగ్గుతారు&period; ఉల్లిగడ్డను మెత్తగా దంచి అందులో తేనే &plus;నెయ్యి &plus; బెల్లం కలిపి ప్రతి రోజు తింటూ ఉంటే శుక్రవృద్ధి కలుగుతుంది&period; జీర్ణ శక్తి తగ్గినప్పుడు ఉల్లిని సన్నగా తరిగి పసుపు &plus;జిలకర &plus;ఉప్ప్పు పొడి చేసి భోజనం లో తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది&period; అలాంటి వారు నిప్పులపై ఉడికించిన ఉల్లిపాయను మెత్తగా చేసి అందులో వేయచిన గసగసాల పొడి కలిపి ప్రతి రోజు తింటే &comma; కొద్ది రోజులల్లో శక్తిని పుంజుకుంటారు&period; మోకాళ్ళలో నొప్పులు &comma; వాపులు ఎక్కువైనప్పుడు ఎఱ్ఱని ఉల్లిగడ్డను ముద్దగా దంచి అందులో ఆవాల పొడి వేసి కలిపి మోకాళ్లపై రాత్రి పడుకునేముందు కట్టుకుని ఉంచితే మోకాళ్ళ నొప్పులు &comma;వాపులు తగ్గి పోతాయి&period; తేలు కాటు వేస్తె &comma; ఉల్లిగడ్డను అడ్డముగా కోసి కాస్త సున్నం రాసి కొట్టిన చోట రుద్దితే విషయాన్ని పీల్చుకుంటుంది&period; జెర్రీ కుడితే ఉల్లి గడ్డ &plus;వెళ్లి పాయలు సమనగా తీసుకుని&comma; దంచి ఆ ముద్దను కుట్టిన చోట కడితే విషయాన్ని పీల్చు కుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం