లూటీ కోసమే మితిమీరిన అప్పులు – రామకృష్ణుడు

Minister Yanamala Ramakrishna

Advertisements

&NewLine;<p>లూటీ కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని&comma; ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు&period; మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని&comma; నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం తప్ప ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు&period; ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు&period; రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్&comma; క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు&period; ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఏపీ 8à°µ స్థానం నుంచి 11à°µ స్థానానికి పడిపోయిందని చెప్పారన్నారు&period; క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించిందని&comma; చేబదుళ్లు&comma; ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్థిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారిందన్నారు&period; జగన్ రెడ్డి దోపిడీ&comma; దుబారాల వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు&period; ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల సమాచారం కాగ్ అడిగినా ఆ లెక్కలు వెల్లడించడం లేదని మాజీ మంత్రి యనమల ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.