ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన భారత్

India shocked Israel

Advertisements

&NewLine;<p>ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది&period; తూర్పు జెరూసెలం&comma; సీరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది&period; మొత్తం 145 సభ్యల దేశాలు గురువారం ఈ తీర్మానాన్ని ఆమోదించగా 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి&period; కెనడా&comma; హంగరీ&comma; ఇజ్రాయెల్&comma; మార్షల్ ఐలాండ్స్&comma; ఫెడరేషన్ ఆఫ్ మైక్రోనేసియా&comma; నౌరూ&comma; అమెరికా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి&period; కాగా&comma; ఇజ్రాయెల్ తీరును ఐక్యరాజ్య సమితిలో భారత్ ఖండించడాన్ని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే స్వాగతించారు&period; ఐరాసా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు&period; తీర్మానం ఫొటో కూడా ఆయన నెట్టింట పంచుకున్నారు&period; పాలస్తీనా భూభాగాల ఆక్రమణ చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు&period; గతనెలలో ఐక్యరాజ్యసమితిలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ భారత్ దూరంగా ఉండిపోయింది&period; ఇజ్రాయెల్&comma; హమాస్ మధ్య సంధి కోరుతూ జోర్డాన్ ఈ రిసొల్యూషన్‌ను యూఎస్ ముందుంచింది&period; అయితే&comma; ఈ తీర్మానంలో ఉగ్రసంస్థ హమాస్ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది&period; ఈ తీర్మానానికి 145 దేశాలు అనుకూలంగా&comma; 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి&period; మరో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి&period; ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది&period; ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు&period; ఉత్తరకాశీలో సిల్క్‌యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది&period; చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది&period; ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం&period; సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే&comma; జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి&comma; వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు&period; సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు&period; సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి&comma; చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..