ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపించారు. వైయస్సార్ జగనన్న భూసురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాల భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నరని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో మొత్తం 2వేల 900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3వేల 300 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోయారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపించారు. గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వాపోతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలిపారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
భూ సర్వే పై రైతులు ఆరోపణ
80