పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు..

crop field

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు&period; పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఏలేస్వరం ప్రత్తిపాడు మండలాలో భారీ వర్ష పాతం నమోదు అయ్యింది&period; భారీ వర్షం కారణంగా నాలుగు మండలాలలో వరి&comma; అరటి పలు వాణిజ్య పంటలు సుమారుగా వందలాది ఎకరాల్లో నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు&period; ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా వరి చేలు పూర్తిగా నీటమునిగాయని&comma; ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని కన్నీరు పర్యతమయ్యారు&period; ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..