94
మైనార్టీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ నెల 8న హనుమకొండ తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్న గూడూరు కు చెందిన 14 ఏళ్ల అబ్బాయి బైక్ నడుపుతూ పట్టుబడ్డారు. బాలుడికి వాహనం ఇచ్చిన కారణంగా తండ్రి సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. రెండు రోజుల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వీరస్వామి తీర్పునిచ్చారు.