డ్రోన్ యంత్రంతో ఎరువుల స్ప్రే..

Drone machine

Advertisements

&NewLine;<p>రాను రాను వ్యవసాయం సులభతరం అవుతుంది&period; దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు&period; ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శ్యాంసుందర్&comma; రాజు పటేల్ అగ్రి గ్రీన్ ప్రారంభించారు&period; 8 ఏళ్ల నుంచి నాటు కోళ్లు పెంపకం&comma; పశువులను పెంచుతూ లాభాలు సాధిస్తున్నారు&period; ఇదే క్రమంలో ఇటీవల అత్యధిక అత్యాధునిక డ్రోన్ యంత్రాన్ని తైవాన్ నుంచి తెప్పించి పంటలపై ఎరువులు&comma; విత్తనాల చల్లేందుకు ఉపయోగిస్తున్నారు&period; ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ డ్రోన్ యంత్రం విధానాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు&period; వ్యవసాయ సాగు కోసం కూలీలు కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది&period; ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ&period;&period; అధునిక వ్యవసాయంలో భాగంగా ఐదు నిమిషాల్లో ఒక ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీలుంటుందని అంటున్నారు&period; ఈ విధానం ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.