‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.

‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

Advertisements

<p>తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది&period; మోహన్ సిద్ధి&comma; మహన్&comma; శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా&comma; రమేష్ చెరుకూరు దర్శకత్వంలో&comma; సావిత్రమ్మ నిర్మాణంలో&comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి&period; సాంబశివరావు మరియు వేణు గోపాల చారి సారధ్యం లో తెర‌కెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’&period; ప్రముఖ సినీ దర్శకులు&comma; నిర్మాతలు&comma; నటుల సమక్షంలో &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్ర టీజర్&comma; ట్రైలర్‌ను ఘనంగా ఆవిష్కరించారు&period; ప్ర‌సాద్ ల్యాబ్‌లోజ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌à°² కార్య‌క్ర‌మంలో ప్రముఖ దర్శకులు ఎ&period; కోదండరామిరెడ్డి&comma; బి&period; గోపాల్&comma; దామోదర ప్రసాద్&comma; తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి&period;ఎన్&period; ఆదిత్య&comma; దర్శకులు వి&period; సముద్ర&comma; రామ్ ప్రసాద్&comma; నటుడు-నిర్మాత అశోక్ కుమార్&comma; నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్&comma; రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;పవన్ కళ్యాణ్ గారి డైలాగ్‌లో వచ్చిన &OpenCurlyQuote;సిద్ధు&period;&period; సిద్ధార్థ్ రాయ్’ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో&comma; అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నాను&period; ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు&period; డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెర‌కెక్కించిన దర్శకుడు రమేష్ గారు భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి&period;ఎన్&period; ఆదిత్య మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు&period; రమేష్ గారు నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి&comma; పట్టుదల నాకు అర్థమైంది&period; అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను&period; మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం&period; ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని&comma; నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;గత పదేళ్లుగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు సినీ పరిశ్రమలోకి వస్తున్నారు&period; అలాంటి వారిలో రమేష్ గారు కూడా ఒకరు&period; మంచి కథతో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు వి&period; సముద్ర మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఇలాంటి మంచి ప్రయత్నాలు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందాలి&period; నిర్మాత ఇంకా ఎన్నో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను&period; ట్రైలర్ చాలా బాగుంది&period; సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ దర్శకుడు ఎ&period; కోదండరామిరెడ్డి మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం&period; టీజర్&comma; ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి&period; చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది&period; ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను&period; దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ దర్శకుడు బి&period; గోపాల్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది&period; ప్రేమకథకు వినోదం&comma; భావోద్వేగాలు జోడించినట్లు కనిపిస్తోంది&period; చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు&period; సినిమా మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు&comma; దర్శకుడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు-నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది&period; కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను&period; చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో మోహన్ సిద్ధి మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన దర్శక దిగ్గజాలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; సొంత ఊరిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారి జీవితాలకు ఈ కథ మరింత దగ్గరగా ఉంటుంది&period; మా ఇద్దరు హీరోయిన్లు ఇద్దరూ ఎంతో బాగా నటించారు&period; ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీకగా ముద్దపప్పు-ఆవకాయ లాంటి వారు అయితే&comma; మరొకరు తెలంగాణకు ప్రతీకగా బిర్యానీ లాంటి వారు&period; ప్రేక్షకులకు వినోదంతో పాటు భావోద్వేగాలను అందించే సినిమా ఇది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ మహన్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;మా కార్యక్రమానికి సినీ దిగ్గజాలు రావడం నిజంగా మా అదృష్టం&period; వారి ఆశీస్సులు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి&period; ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>మరో హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు&period; చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు&period; మంచి కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు రమేష్ చెరుకూరు మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;సినిమా మీద ఫ్యాష‌న్‌తో ఈ రంగంలోకి à°µ‌చ్చాను&period; ఐదేళ్ల కోరిక నెర‌వేరిన క్ష‌ణం ఇది&period; మా ఈ ప్రాజెక్టు ప్రయాణంలో వి&period;ఎన్&period; ఆదిత్య గారి సహకారం నాకు ఎంతో ఉపయోగపడింది&period; ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం&period; టీజర్&comma; ట్రైలర్‌కు వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది&period; త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం&period; ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ప్రేమకథలో వినోదంతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుందని హీరో తెలిపారు&period; హీరోయిన్లు తమ పాత్రలపై సంతోషం వ్యక్తం చేశారు&period; సంగీత దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు&period; ఈ చిత్రంలో సీనియ‌ర్ à°¨‌టుడు సుమన్&comma; స్నేహ&comma; ఆనంద్ భారతి&comma; సర్కార్&comma; అలీష&comma; చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు&period; &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్&comma; ట్రైలర్‌కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి&period; త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.