గూడాల లో అగ్నిప్రమాదం | Fire Accident in Gudala
ది. (14-04-2024) అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు దగ్ధం అయ్యాయి. పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. అంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పదిమంది ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడ్డారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మొదట ఆకుల మంగతాయారు (దివ్యాంగురాలు) కు చెందిన ఇంటి పైకప్పు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కింట్లో నిద్రిస్తున్న దొడ్డా వెంకటేశ్వరరావు కుమార్తె రేవతి మంటలు వ్యాపించడం గమనించింది. దీంతో ఒక్కసారిగా కేకలు వేసి అందరినీ నిద్ర లేపింది. దీంతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.
ఈ అగ్నిప్రమాదం(Fire Accident )లో ఆకుల మంగతాయారు, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకుల సత్యనారాయణ కు చెందిన తాటాకు ఇల్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ఆకుల సత్తిబాబు డాబా ఇల్లు పాక్షికంగా మంటల తీవ్రతకు దెబ్బతింది. ఈ కుటుంబాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు గార్లు పరామర్శించినారు. వారికి ఆనందరావు గారు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం మరియు 20,000.00 రూపాయలు సహాయార్థం అందించినారు. ఆకుల మంగతాయారు (దివ్యాంగురాలు) కి 2000.00. రూపాయలు సహాయార్థం అందించినారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర నాయకులు కర్రి రామస్వామి(దత్తుడు), అల్లవరం మండలం అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు, పోలిశెట్టి భాస్కరావు, పోలిశెట్టి నాయుడు, నంద్యాల దొరబాబు, మందా గెద్దయ్య తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గూడాల లో అగ్నిప్రమాదం…నిరాశ్రయులైన మూడు కుటుంబాలు.!