101
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు, మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఫైర్, పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్లని బయటకు పంపిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీ క్రేన్లతో అందించిన సహాయ సహకారాలు వల్ల పెను ప్రమాదం తప్పింది.