71
హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. కేబుల్ బ్రిడ్జి పక్కన ఉన్న నిర్మాణస్య ప్రాంతంలో చెత్తాచెదారం చేరడంతో పాటు ఎండిపోయిన గడ్డి ఇతర మొక్కలు ఉండటంతో, గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ గాని ఇతర కాల్చిన వస్తువులను అందులో వేయడం వల్ల ఆ చెత్త అంటుకోవడం జరిగిందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. పొగలు దట్టంగా రావడంతో పక్కనే ఉన్న ఐ టి సి కోహినూర్ హోటల్ సిబ్బంది స్పందించి సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలనికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చరు.