83
గుంటూరులోని డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. గోరంట్ల రోడ్ లోని డొమినోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు అగ్నిమాపక అధికారులు. కుర్చీలు, టేబుళ్లు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు.