బడ్జెట్ ధరలో లగ్జరీ Smart Watch ను లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్.!

Fire Bolt has launched a luxury Smart Watch at a budget price

Advertisements

&NewLine;<p>ఇండియన్ మార్కెట్ లో మంచి స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా పేరొందిన ఫైర్ బోల్ట్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది&period; ఈ స్మార్ట్ వాచ్ ను బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసినట్లుగా ఫైర్ బోల్ట్ చెబుతోంది&period; ఎందుకంటే&comma; ఈ స్మార్ట్ వాచ్ లగ్జరీ రాయల్ స్టెయిన్ లెస్ డిజైన్&comma; రోటెనింగ్ క్రౌన్ మరియు మోషన్ గేమింగ్ ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లతో లాంచ్ అయ్యింది&period; ఈ లేటెస్ట్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి&period; ఫైర్ -బోల్ట్ రాయల్ పేరుతో ఫైర్ బోల్ట్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ బడ్జెట్ లగ్జరీ స్మార్ట్ వాచ్ రూ&period; 4&comma;999 స్పెషల్ లాంచ్ ధరతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశించింది&period; ఈ స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్సైట్ మరియు అమేజాన్ ఇండియా నుండి లభిస్తోంది&period; ఈ స్మార్ట్ వాచ్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఫైర్ బోల్ట్ ఆఫర్ చేస్తోంది&period; చవక ధరలో AI-ENC Earbuds వచ్చేశాయి&period; ఫైర్ -బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు ఈ ఫైర్ -బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే&comma; ఈ స్మార్ట్ వాచ్ ను లగ్జరీ డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది&period; ఫైర్ బోల్ట్ రాయల్ లో 1&period;43 ఇంచ్ AMOLED డిస్ప్లే 750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది&period; ఈ వాచ్ లో 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది&period; ఈ స్మార్ట్ వాచ్ 5 అందమైన లగ్జరీ కలర్ ఆప్షన్ లలో కూడా లభిస్తుంది&period; రాయల్ స్మార్ట్ వాచ్ రొటేటింగ్ క్రౌన్&comma; బ్లూటూత్ కాలింగ్&comma; హార్ట్ మోనిటర్&comma; SpO2 మరియు స్లీప్ మోనిటర్ ఫీచర్స్ తో కూడా వస్తుంది&period; ఇందులో మోషన్ గేమింగ్ కంట్రోలింగ్ సపోర్ట్ ను కూడా ఫైర్ బోల్ట్ అందించింది&period; ఇందులో&comma; వాయిస్ అసిస్టెంట్&comma; 300&plus; స్పోర్ట్స్ మోడ్స్&comma; 130&plus; బిల్ట్ ఇన్ వాచ్ ఫేస్ లు&comma; 380mAh బ్యాటరీ మరియు ఫైర్ బోల్ట్ హెల్త్ సూట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.