చాలా మందికి ఆకలి వేయదు. ఎంత చెప్పినా భోజనం చేసేందుకు ససేమిరా అంటుంటారు. దీనివల్ల నీరసం, అలసటతో అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే ఆకలి బాగా అవుతుంది. అవేంటో తెలుసుకుందాము. టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి 10 రోజుల పాటు భోజనానికి అర్థగంట ముందు తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. టీ స్పూన్ బెల్లంపొడి, అరటీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని రోజూ ఏదో ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను నిమిలి మింగితే ఆకలి బాగా వేస్తుంది. కప్పులో నీటిని తీసుకుని అందులో ఉసిరి రసం, నిమ్మరసం, తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్లు ఉదయం పరగడపున తాగితే ఆకలవుతుంది. నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టి ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి వేస్తుంది. అవసరమైన విశ్రాంతిని తీసుకుంటుంటే బాగా ఆకలి వేస్తుంది.
ఆకలి వేయాలంటే ఈ చిట్కాలను పాటించాలి
71
previous post