చాలా మందికి ఆకలి వేయదు. ఎంత చెప్పినా భోజనం చేసేందుకు ససేమిరా అంటుంటారు. దీనివల్ల నీరసం, అలసటతో అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే ఆకలి బాగా అవుతుంది. అవేంటో తెలుసుకుందాము. టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి 10 రోజుల పాటు భోజనానికి అర్థగంట ముందు తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. టీ స్పూన్ బెల్లంపొడి, అరటీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని రోజూ ఏదో ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను నిమిలి మింగితే ఆకలి బాగా వేస్తుంది. కప్పులో నీటిని తీసుకుని అందులో ఉసిరి రసం, నిమ్మరసం, తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్లు ఉదయం పరగడపున తాగితే ఆకలవుతుంది. నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టి ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి వేస్తుంది. అవసరమైన విశ్రాంతిని తీసుకుంటుంటే బాగా ఆకలి వేస్తుంది.
Lemon Juice
పాదాలు పగిలినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నడవడానికి, పాదాలను రుద్దడానికి కూడా కష్టంగా ఉంటుంది. పాదాలు పగిలినప్పుడు క్రింది వాటిని చేయడం వల్ల త్వరగా నయం అవుతాయి. పాదాలను ఎల్లప్పుడూ పొడిగా ఉంచండి. పాదాలలో తేమ పేరుకుపోయినప్పుడు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, పాదాలను స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టుకోండి. పాదాలను మాయిశ్చరైజ్ చేయండి. పగిలిన పాదాలకు మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండుసార్లు రాసుకోండి. ఇది పాదాలను మృదువుగా మరియు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పాదాలను రుద్దండి. పాదాలను రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పాదాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పగిలిన పాదాలకు యాంటీసెప్టిక్ లోషన్ రాసుకోండి. ఇది ఇన్ఫెక్షన్ను నివారించడంలో సహాయపడుతుంది. పాదాలు పగిలినప్పుడు ఇంటి చిట్కాలు పాదాలను నిమ్మరసంతో రుద్దండి. నిమ్మరసం యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పాదాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను ఆలివ్ నూనెతో రుద్దండి. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు మరియు మృదువుగా చేయే లక్షణాలు ఉంటాయి. ఇది పాదాలను మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను పాలతో రుద్దండి. పాలలో ప్రోటీన్లు మరియు లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి పాదాలను మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది. కప్పు రోజ్ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్ పొడినీ, రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్ వాటర్ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు. సబ్బుని చిన్న చిన్న ముక్కల్లా చెక్కుకొని, మూడు టీ స్పూన్ల నిండా దాన్ని తీసుకోవాలి. దానిని పావు కప్పు నీళ్లలో కలిపి వేడి చేసి, నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్‌నీ, టీ స్పూను గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి. తయారైన మిశ్రమాన్ని ముఖ వర్ఛస్సుకు రాసుకోవచ్చు.





Total views : 79585