చంద్రబాబుకు పూర్తి స్థాయిలో బెయిల్

chandrababu

Advertisements

&NewLine;<p>స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది&period; చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది&period; దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు&period; ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే&period; ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి&period; సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16à°¨ ప్రకటించింది&period;అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది&period; అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు&period; దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది&period; అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు&period; కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది&period; ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా&comma; దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు&period; ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్టైన వారెవరూ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జైలులో ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది&period; అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే 52 రోజులపాటు జైలులో ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది&period; ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది&period; మరోవైపు చంద్రబాబు అనారోగ్య సమస్యలను సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది&period; చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం మరోవైపు గుండె పరిణామం పెరగడం ఇలాంటి కారణాల దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..