తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌..

gaddam prasad kumar

Advertisements

&NewLine;<p>తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది&period; ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది&period; ఇక నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి&period; సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేయనున్నారు&period; శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు&period; ఆయన వెంట సీఎం రేవంత్‌రెడ్డి&comma; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; పలువురు మంత్రులు&comma; భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు&comma; మాజీ మంత్రి కేటీఆర్‌&comma; ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు&period; ప్రసాద్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు&period; స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది&period; ఆయనకు 63 మంది కాంగ్రెస్‌ సభ్యులు&comma; 39 మంది బీఆర్‌ఎస్‌ సభ్యులు&comma; ఏడుగురు ఎంఐఎం సభ్యులు&comma; సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది&period; స్పీకర్‌ ఎన్నిక కోసం ఇవాళ ఉదయం 10&period;30 గంటలకు సభ ప్రారంభం కానున్నది&period; ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేత&comma; ప్రొటెంస్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; అనంతరం రేపటి ఉభయసభలను ఉద్దేశించిన… గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించే విషయాన్ని స్పీకర్‌ ప్రకటించనున్నారు&period; ఆ తరువాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..