నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Gaddam Prasad Kumar

Advertisements

&NewLine;<p>తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు&period; స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు&period; స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు&period; ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు&period; అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రి శ్రీధర్ బాబు&comma; కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు&period; ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు&comma; ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు&period; తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; బాధ్యతలను స్వీకరించారు&period;<br>గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది&period; మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం&period; తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు&period; ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; 2008 ఉపఎన్నిక&comma; 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు&period; ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు&period; ఆ తర్వాత 2014&comma; 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు&period; వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు&period; ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది&comma; అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు&period; గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ&comma; ఇద్దరు సంతానం ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..