తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభ ఆస్తులను కొల్లగొట్టడానికి కుట్ర పన్నుతున్న గుర్తించ లేని సెంట్రల్ హిందీ ప్రచార సభకు చెందిన గైబువలి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు హిందీ ప్రచార సభలో జరుగుతున్న కొందరి అరాచకాలపై చర్చల జరిపి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ నూతన కమిటీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి.గాంధీ మాట్లాడుతూ… ఆంధ్రా, తెలంగాణ ఏర్పడినంక 2019లో ఏర్పడిన కమిటీ
కార్యవర్గం లో 11 మంది ఉన్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉన్నదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినంక తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభకు చెందిన ఆస్తులు, నిధులపై ప్రశ్నించినందుకు తమ కమిటీని ఎలాగైనా విచిన్నం చేయాలని ఆంధ్రకు చెందిన హిందీ ప్రచార సభకు చెందిన గైబువలి కుట్రలు పన్నుతు తనకు నచ్చినట్లు ఉండాలని మా కమిటీలో ఒకరిని మలుపుకొని నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రకటించారని, దీన్ని మెజారిటీ సభ్యులం ఉన్న మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నూతన కమిటీ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని ప్రభుత్వం దర్యాప్తు జరిపించి నిజమైన కమిటీ తో కలసి తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభకు చెందిన ఆస్తులను పరిరక్షించాలని కోరారు. ఇప్పటికే 1963లో రద్దయిన సెంట్రల్ హిందీ ప్రచార సభ పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆంధ్రకు చెందిన గైబువలి పై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నాంపల్లిలోని ఉన్న హిందీ ప్రచార సభకు చెందిన భూమిని అక్రమంగా అమ్ముకుని కోట్లు దన్నుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Read Also…
హిందీ ప్రచార సభ ఆస్తులను కొల్లగొడుతున్న గైబువలి…
66
previous post