91
3 కోట్ల విలువ చేసే 6వందల 35 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో ఈ ఎండు గంజాయి పట్టుబడిందన్నారు. బీహార్ కు చెందిన వ్యక్తి, ఒరిస్సా రాష్ట్రంలోని కొంతమంది, గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ch.రూపేష్ తెలిపారు. బొలెరో వాహనాలకు నంబర్ ప్లేట్లను మారుస్తూ, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను మారుస్తూ అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారని అన్నారు. ఎక్కడైనా గంజాయి పండించిన, అమ్మిన, అక్రమ రవాణా చేసినా.. సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.