Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) చిత్రబృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకి అంజలి., కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి., చిత్ర దర్శకుడు శివ., చిత్ర రచయిత కోన వెంకట్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. సినిమాకు ప్రేక్షకుల వద్ద నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. గీతాంజలి హిట్ అయినా విధంగా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఘనవిజయం సాధిస్తుందన్నారు. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి., గేమ్ చేంజర్ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
ఇది చదవండి: పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం జోరు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.