64
ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకూ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022,2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించనుందని తెలుస్తోంది. నిబంధనల్లో స్వల్ప సడలింపు ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా టెట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు కనీసార్హతగా నిర్ణయించారు. అయితే, ఈసారి మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ సడలింపు ఇచ్చారు.