టీఎస్పీఎస్సీ గ్రూప్స్(TSPSC Groups):
టీఎస్పీఎస్సీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఓ శుభవార్త. గ్రూప్స్-2,3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కల్పిస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2,3 పోస్టుల వివరాలను ఆర్థిక శాఖకు అందించాలని అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణా రావు సచివాలయంలో అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2లో 783 పోస్టులను, గ్రూప్-3లో 1388 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ జారీ(Issuance of notification) చేసింది. అయితే, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల అదనపు పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ(Issuance of Group-1 notification) చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి