ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం..

H. Arun Kumar

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని&comma; రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్&period; అరుణ్ కుమార్ చెప్పారు&period; ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడు&comma; వట్లూరు&comma; రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును&comma; సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను&comma; అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని&comma; అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు&period; గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1&period;10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు&period; కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు&period; తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు&period; కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని&comma; ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు&period; రంగుమారిన ధాన్యం&comma; నూకశాతం పై రైతుకి&comma; మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.