రాష్ట్ర భవిష్యత్తు బాబు షూరిటితోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి కార్యక్రమాన్ని బుధవారం పల్లె చేపట్టారు. తెలుగు తమ్ముళ్లు, మహిళలు పల్లెకు హారతితో ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి పల్లె ఇంటింట కలియ తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ… బాబు షూరిటి పథకాలను ప్రజలకు వివరించారు. కాలనీలోని మసీదులో ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పల్లె ముస్లిం మత పెద్దలను కోరారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డ కు నెలకు రూ. 1500 రూపాయలు, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000, ప్రతి రైతుకు ఏడాదికి, రూ. 20వేల రూపాయలు, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ.3 వేలు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి తాగునీటి కులాయి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని, టిడిపి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పిన విధంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని పల్లె హామీ ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పల్లె కాలనీవాసులకు పిలుపునిచ్చారు.
భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి…
256
previous post