తెలంగాణలో భారీ వర్షాలు

Heavy rains in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది&period; ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది&period; పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి&period; తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ&comma; రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది&period; హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది&period; చాంద్రాయణగుట్ట&comma; ఫలక్‌నుమా&comma; బార్కాస్&comma; మియాపూర్‌&comma; చందానగర్&comma; మదీనాగూడ&comma; మాదాపుర్&comma; గచ్చిబౌలి&comma; రాయదుర్గం&comma; కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి&period; రాజేంద్రనగర్&comma; అత్తాపూర్&comma; బండ్లగూడ జాగిర్&comma; మణికొండ&comma; నార్సింగి&comma; శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది&period; కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది&period; ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది&period; ఆదిలాబాద్&comma; ఆసిఫాబాద్&comma; జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది&period; పలుచోట్ల ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.