తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత

Heavy security in 49 counting centers across Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది&period; 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత&comma; సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు&period; హైదరాబాద్&comma; రంగారెడ్డి&comma; మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు&comma; 144 సెక్షన్ అమలు చేశారు&period; కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు&comma; టపాసులు కాల్చడం&comma; ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది&period; రాష్ట్రవ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ చేశారు&period; ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు&comma; సిబ్బంది చేరుకోనున్నారు&period; లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు&period; ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది&period; వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది&period; స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 2&comma;290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది&period; మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు&period; ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు&period; మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు&period; ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య&comma; స్టీఫెన్ రవీంద్ర&comma; డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు&period; కౌంటింగ్ సెంటర్లు&comma; బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు&period; ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని&comma; వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు&period; నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..