సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

singareni Rally

Advertisements

&NewLine;<p>తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది&period; దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి&period; సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39&comma;784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు&period; ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది&period; సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి&period; అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి&comma; సిపిఐ అనుబంధ ఎఐటియుసి&comma; బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం&comma; బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి&period; అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది&period; గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.