రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు..

Raghavendra Rao

Advertisements

&NewLine;<p>సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది&period; రాఘవేంద్ర రావుకు&comma; ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది&period; హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాలను ప్రభుత్వం సినీ పరిశ్రమకు కేటాయించింది&period; ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓమారు నోటీసులు జారీ చేసినా&comma; అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చింది&period; అనంతరం&comma; విచారణను న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది&period; మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు&period; సర్వే నెం&period;403&sol;1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు&period; ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే&comma; జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది&period; ప్రతివాదులైన రాఘవేంద్రరావు&comma; ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు&comma; చక్రవర్తి&comma; విజయలక్ష్మి&comma; అఖిలాండేశ్వరి&comma; లాలస దేవికి నోటీసులిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..