హత్య చేసింది అత్త మామలే..

murder

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా… ఇచ్చాపురం… అక్టోబర్ 8à°µ తేదీన ఇచ్చాపురం మండలంలోని నీలాపు పుట్టుక గ్రామంలో గృహిణి నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే&period; అయితే ఆమెను స్వయంగా ఆమె అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని&comma; హత్య చేసింది తామే అంటూ పోలీసులకు లొంగిపోయారు&period; ఈ మేరకు శుక్రవారం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు&period; అక్టోబర్ 8à°µ తేదీన నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో మృతి చెందింది&period; కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని అత్తమామలు అప్పుడు పోలీసులకు వివరించారు&period; అయితే పోలీసులు ఈ మృతిని అనుమానస్పద మృతిగా నమోదు చేశారు&period; ఇదిలా ఉండగా మీనా కుమారి అత్త అన్నపూర్ణ&comma; మామ జగ్గారావు తామే తమ కోడలను హత్య చేసినట్లు అంగీకరించారని సి ఐ ఎస్ ఆర్ ప్రసాద్ తెలిపారు&period; పోస్టుమార్టం నివేదిక బయటికి వస్తే ఆమె మృతి ఆత్మహత్య కాదనే విషయం బయట పడుతుందని దాంతో వారు తమ నేరాన్ని అంగీకరించాలని చెప్పారు&period; మీనా కుమారి భర్త మోహన్రావు పోలాండ్ లో పనిచేసుకుంటున్నాడని&comma; మీనా కుమారి తో అత్తమామలకు తరచూ గొడవలు జరుగుతున్నాయని &comma; ఆ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా అత్తమామలు మీనా కుమారుని హతమార్చారని చెప్పారు&period; మీనా కుమారి హత్యను అత్తమామలు ఆత్మహత్యగా చిత్రీకరించడంలో వారికి సహకరించిన బంధువు హేమరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు&period; ఈ సమావేశంలో పట్టణ ఎస్సై కే గోవిందరావు కూడా పాల్గొన్నారు&period; మీనా కుమారికి ఐదేళ్ల బాలుడు&comma; రెండు నెలల పాప ఉన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…