ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం

High level meeting at 11 am

Advertisements

&NewLine;<p>నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది&period; నాగార్జునసాగర్&comma; శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది&period; కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది&period; ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ&comma; తెలంగాణ సీఎస్ లకు సూచించింది&period; సీఆర్పీఎఫ్&comma; సీఐఎస్ఎఫ్ డీజీలు&comma; సీడబ్ల్యూసీ&comma; కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది&period; సీడబ్ల్యూసీ&comma; కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది&period; కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది&period; ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి&period; సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి&period; ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు&period; నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.