నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31 వ తేదీ రాత్రి 8.00 గంటల నుండి జనవరి 01 వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్ – శంభీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసి వేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసిపి అన్నారు. శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒక వేళ మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, నియమ నిబంధనలు పాటించకపోతే వాహన దారల పై చట్టపరమైన, న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకరు వాహనాలు అజాగ్రత్త నడిపితే, ఒకరు వల్ల ఇంకొకరి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని అన్నారు. ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే సదరు వ్యక్తి కుటుంబం రోడ్డుపై పడుతుందని, ఒకరి నిర్లక్ష్యంతో మరొకరు ఇబ్బందుల పాలవుతారని ఎసిపి చెప్పుకొచ్చారు. డిసెంబర్ 31 రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ఎ.సి.పి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసిన, టపాసులు/ బాణసంచా పేల్చిన, బైక్ ర్యాలీ లు చేసిన సి.సి కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదుచేస్తామని అన్నారు. సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సి.ఐ వెంకట్ రెడ్డి, యస్. ఐ లు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆ రోజు పోలీసులకు దొరికితే అంతే..!
67
previous post