ఎరుపు, గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు. తప్పనిసరిగా కొనాలి. ఎందుకంటే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు. తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు. కొంతమంది ఉడకబెట్టి తింటారు. ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా తీసుకుంటారు. వీటి గొప్పతనం గురించి తెలుసుకుందాం. వీటిని తింటే బరువు పెరిగిపోతామనే ఆలోచనతో చాలా మంది కొనరు. ఈ దుంపలను మనం రోజూ ఆహారంలో చేర్చుకోవచ్చు. చిలకడదుంపలను తీసుకుంటే వాటిలో పొటాషియం ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీకి కారణమయ్యే సోడియం చర్యను పొటాషియం నియంత్రిస్తుంది. ఈ దుంపలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి ఒకసారైనా వీటిని తినాలి. రక్తనాళాలు దెబ్బతినకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి. తొక్క తీసేసి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తింటే ఆ రుచే వేరు. ఇలా తినడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. వీటిలోని పండి పదార్థంవల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. వీటిల్లో కరిగేవి, కరగనివి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతోపాటు దాన్ని బయటకు పంపించడంలో కూడా సాయపడుతుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దుంపలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది క్యారెట్‌లో కూడా ఉంటుంది. చిలకడ దుంపలు తినడం ఎంతో మంచిది. దీర్ఘకాలిక మంట వల్ల గుండె జబ్బులు వస్తాయి. చిలకడ దుంపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో మంట తగ్గడంతోపాటు ఛాతి దగ్గర వచ్చే మంట లాంటిది తగ్గుతుంది.
Read Also..
Read Also..