తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కోడియంబెడు గ్రామంలో నాలుగు రోజుల క్రితం తల్లిని చంపిన రెండో కొడుకు కృష్ణారెడ్డి కుమారుడు ఇలంగోవన్(మనవుడు) అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సి ఐ ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పుత్తూరు రూరల్ సి ఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ 02/04/2024 తేదీన రాజమ్మ కు ఇద్దరూ కుమారులు లేట్ మునస్వామి, కృష్ణ రెడ్డి, ఇద్దరూ కుమార్తెలు మునెమ్మ, రేణుక ఉన్నారు. రాజమ్మ భర్త ఆరుముగం 10సం”క్రితం చనిపోవడంతో రాజమ్మ బాగోగులు చూసుకుంటున్న పెద్ద కుమారుడు లేట్ మునస్వామి కొడుకు హరికృష్ణ(మనవుడు) పేరుమీదగా ఉన్న ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో చిన్న కొడుకు కృష్ణారెడ్డి, కోడలు గౌరీ వీరి కుమారుడు ఇళంగోవన్ కలిసి రావలసిన ఆస్తి మాకు ఇవ్వాలని తరచు రాజమ్మ పై గొడవలు చేస్తూ ఉండేవారు.
ఆఖరి సారిగా ఆస్తిలో మాకు వాటా ఇస్తారా … లేదంటే మిమ్మల్ని చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరించడంతో పెద్ద కొడుకు లేట్ మునస్వామి కుమారుడు (మనవుడు) హరికృష్ణ అమ్మగారు దేవకి ఇద్దరు కలిసి 02/03/2024 తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు రావడంతో ఇంట్లో ఎవరూ లేని దాన్ని గమనించి రెండో కుమారుడు కృష్ణారెడ్డి, భార్య (రెండో కోడలు)గౌరీ వీరి కుమారుడు (మనవుడు) ఇలంగోవన్ ముగ్గురు కలిసి ఇతడి చేతిలో కత్తి ఇచ్చి పంపించి రాజమ్మను గొంతు కోసి పథకం ప్రకారం హతమార్చారు, వీరిలో మనవుడు ఇలంగోవన్ ను బంగాళా పంచాయతీ రోడ్ నందు అరెస్ట్ చేసినట్లు మిగిలిన ఇద్దరినీ హత్యకు కారకులైన కృష్ణారెడ్డి గౌరీలను త్వరగా అరెస్టు చేస్తామని సి ఐ భాస్కర్ నాయక్,ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.