జడ్చర్ల విద్య, వైద్య రంగాల్లో….

The MLA started the mid-day meal program with his own funds

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కుటుంబ పరిస్థితులు&comma; ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక&comma; కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు&period; ఈ విషయాన్ని గుర్తించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు కాలేజీల్లో చదువుతున్న సుమారు 1300 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కొరకు నేడు జడ్చర్ల నియోజకవర్గం లోని ఐదు జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు&period; అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో మౌఖిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు&period; కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు&period; జడ్చర్ల నియోజకవర్గం విద్య&comma; వైద్య రంగాలలో ముందంజలో ఉంచాలని అన్నారు&period; దీనిని ఆదర్శంగా తీసుకుని ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు&period; అదేవిధంగా మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం ఐఏఎస్&comma; ఐపీఎస్ ఉన్నత స్థాయి రంగాల్లో విద్యార్థులు ఉండాలనేదే నా యొక్క ఆకాంక్షాన్ని తెలిపారు&period; కళాశాల మధ్యాహ్న భోజనం కార్యక్రమం పట్ల కళాశాల అధ్యాపకులు&comma; విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు&period; మరోవైపు జడ్చర్ల ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు వారిని బెదిరించి నెల నెల డబ్బులు వసూలు చేసే వారిని అలాగే సి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలనుకుంటే పరిశ్రమల యాజమాన్యాలు తనకు ఇవ్వకుండా నేరుగా నియోజకవర్గంలోని విద్య&comma; వైద్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..