జల్లికట్టు నిర్వహించరాదని ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు పదే పదే చట్టం తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసులు కట్టడిచేయక గోహింసను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జల్లికట్టు నిర్వహణకు పాత్ర పోషిస్తు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గోవధ కంటే గోహింస మహా పాపం, తెలిసి, గోవధపై ఉన్న ఆంక్షలు, అదే పశువులను నడి బజార్లో, జల్లికట్టు పేరుతో, హింసిస్తూ పరుగుపందెము చేపడుతూ, ప్రైజులు పెట్టించి, గోవులకు వేడుకగా వాటికి
ప్రభలు కట్టించి, నడి వీధిలో జల్లికట్టు ఉత్సవాలలో పరుగెత్తించారు. జల్లికట్టు నిర్వాహకుల యత్నంలో ఆ గోవులను హింసిస్తూ పరిగెత్తుస్తుంటే, ఆ గోవులు
కన్నులనుండి, కారుతున్న కన్నీరు, భీతి, ఆ గోవులపై వేస్తున్న గట్టిదెబ్బలు, గుద్దులు, గోపధకంటే దారుణమైనదని, గుర్తించక జల్లికట్టు నిర్వహణ జరిగిస్తూ ఉంటే సంబంధిత పోలీస్ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పండుగ పేరుతో జల్లికట్టు కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ప్రమాదకరమైన జల్లికట్టును వేడుకగా కొంతమంది రాజకీయ పెత్తందారుల వత్తాసులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎద్దులు చేరుకొని పండుగను భారీ ఎత్తున నడుపుతున్నారు.
జల్లికట్టు పేరుతో.. గోహింస
87
previous post